కల్తీ ఫుడ్ మీరు తింటే.. బెయిల్ ఇస్తాం : కోర్టు వ్యాఖ్య
1 min readపల్లెవెలుగు వెబ్: ఆహార కల్తీ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నిందితుల తరుపు న్యాయవాదికి చుక్కెదురైంది. ఆహార కల్తీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన క్లయింట్లకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పునీత్ జైన్ అనే న్యాయవాది కోర్టును కోరారు. అయితే సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ మీ క్లయింట్ తయారు చేసిన కల్తీ వస్తువులు మీరు, మీ కుటుంబ సభ్యలు తింటే బెయిల్ ఇస్తాం’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో న్యాయవాది సమాధానం చెప్పకుండా ఉండిపోయారు. ఇతరులవైతే ప్రాణాలు పోతేపోనీ మనకేంటి అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించింది. దీంతో సదరు న్యాయవాది నిందితుల తరపు బెయిల్ పిటిషన్ ను వెనక్కితీసుకున్నారు. మధ్యప్రదేశ్ కి చెందిన పవార్ గోయల్, పునీత్ గోయల్ అనే వ్యాపారులు గోధుమపిండ కల్తీ చేస్తున్నారని కేసు నమోదైంది.