PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ కూర‌గాయ‌లు తింటే.. మీ జుట్టు రాల‌దు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఒక మ‌నిషి అందంగా క‌నిపించడంలో జుట్టు పాత్ర చాలా కీల‌కం. జుట్టుకు మ‌గ‌, ఆడ తేడా లేకుండా చాలా ప్రాముఖ్యత‌ను ఇస్తారు. జుట్టును కాపాడుకోవ‌డానికి వేల‌కు వేలు ఖ‌ర్చే చేస్తారు. జుట్టు రాలుతుందంటే.. మాన‌సికంగా కుంగిపోతారు. జుట్టుతో ర‌క‌ర‌కాల ప్రయోగాలు చేస్తారు. ‘జుట్టు ఉన్న ఆమె.. ఎన్ని జ‌డ‌ల‌యిన వేసుకుంటుంద‌న్నసామెత కూడ జ‌న‌బాహుళ్యంలో ఉంది. ఇంత ప్రాధాన్యత ఇచ్చే జుట్టు రాల‌కుండా ఉండాలంటే ఈ కింది కూర‌గాయ‌లు తినాల‌ని వైద్యులు చెబుతున్నారు.

పాలకూర : పాల‌కూర‌లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. ఐర‌న్ లోపం కార‌ణంగానే జుట్టు రాలే స‌మ‌స్య అధికంగా ఉంటుంది. వెంట్రుక‌లు దృఢంగా ఉండ‌టానికి ఐర‌న్ దోహదం చేస్తుంది. పాల‌కూర నుంచి ఐర‌న్, జింక్, పీచు ప‌దార్థం తో పాటు, ఇత‌ర అవ‌స‌ర‌మైన విట‌మిన్లు ల‌భిస్తాయి.

క్యారెట్ : క్యారెట్ లో విట‌మిన్ బి7 కావాల్సినంత ఉంటుంది. దీనిని బ‌యోటిన్ అంటారు. ఇది జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యార‌ట్ ఉప‌యోగించి హెయిర్ ప్యాక్ లు కూడ త‌యారు చేస్తారు. ఈ ప్యాక్ లు వెంట్రుక‌లు రాల‌కుండా దృడంగా ఉంచుతాయి.

ఉల్లిపాయ‌లు: మ‌న వంట‌కాల్లో ఉల్లిపాయ లేని కూర ఉండ‌దు. త‌ల్లి చేయ‌లేని మేలు ఉల్లి చేస్తుంద‌న్న సామెత కూడ ఉంది. ఉల్లిలో జింక్, ఐర‌న్, బ‌యోటిన్ తో పాటు, వెంట్రుక‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల విట‌మిన్లు, పోష‌కాలు ఉల్లిపాయ‌ల్లో దొరుకుతాయి.

చిల‌గ‌డ‌దుంప : చిల‌గ‌డ‌దుంప‌లో బీటాకెరోటిన్ ఉంటుంది. బీటాకెరోటిన్ ఆహారం ద్వార మ‌న శ‌రీరంలోకి ప్రవేశించివిట‌మిన్ ఏ` గా మారుతుంది. ఇది వెంట్రుక‌లను సంర‌క్షించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.
టమోట :
టమోటలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నిర్జీవ‌మైన కురుల‌కు జీవం పోస్తాయి. జుట్టు కుదుళ్లలో ఉన్న టాక్సిన్లు, మ‌లినాలను తొల‌గిస్తాయి.

About Author