మనసున్న వాడు ఎదురైతే పెళ్లి చేసుకుంటా !
1 min readపల్లెవెలుగు వెబ్ : పి.వి. సింధు. భారత స్టార్ షట్లర్. ఆమె పేరు వినగానే ఆమె పతకాలు, విజయాలే గుర్తుకువస్తాయి. ఒలంపిక్స్ లో ఆమె సాధించిన రెండో పతకంతో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. రెండు ఒలంపిక్స్ లో పతకాలు సాధించిన ఘనత పి.వి. సింధుకు దక్కింది. ఆమె ఇంతటి స్థాయికి చేరడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. వారి త్యాగాల ఫలితమే ఆమె విజయాలు అని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. తల్లిదండ్రుల తర్వాత భర్త ఆ లోటును కట్టుకున్న భర్తే తీర్చగలడు. అలాంటి భర్త గురించి, పెళ్లి గురించి పి.వి. సింధును ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కాబోయే వాడికి మంచి మనసుండాలని పి.వి. సింధు అన్నారు. నన్ను నన్నుగా అర్థం చేసుకుని.. ప్రేమించే వ్యక్తి అయి ఉండాలని తన కాబోయ భర్తకు ఉండాల్సిన క్వాలిటీ గురించి పి.వి. సింధు మనసులో మాట బయటపెట్టింది. అలాంటి వ్యక్తి ఇంకా ఎదురు కాలేదని, అలాంటి వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా అని తెలిపింది.