పడుకుంటే.. 25 రోజులు మెళకువ రాదు !
1 min readపల్లెవెలుగు వెబ్ : పురాణాల్లో కుంభకర్ణుడు ఆరు నెలలు తింటే.. ఆరు నెలలు పడుకుంటారని విన్నాం. ఇలాంటి మనుషులు ఈ కాలంలో ఉంటారా ? అన్న సందేహం మనకు వస్తుంది. కానీ రాజస్థాన్ లోని భద్వా గ్రామంలో ఇలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. పుర్ఖారామ్ అనే వ్యక్తి అతినిద్ర వ్యాధితో బాధపడుతున్నారు. ఏడాదిలో 300 రోజులు నిద్రలో ఉంటాడు. చిరువ్యాపారం చేసే పుర్ఖారామ్ కు ఇప్పుడు 42 ఏళ్లు. 19 ఏళ్ల వయసు నుంచే ఈ వ్యాధితో బాధపడుతున్నాడట. ఒకసారి పడుకుంటే ఏకధాటిగా 25 రోజులు మంచానికి అతుక్కుంటాడట. నిద్ర లేచిన తర్వాత తలనొప్పి ఉందని బాధపడుతారట. అతినిద్ర కారంణంగా పుర్ఖారామ్ ను స్థానికులు కుంభకర్ణుడు అని పిలుస్తారట.