30 మార్కులు వస్తే.. పదో తరగతి పాస్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31న పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి పదో తరగతి పాస్ మార్కులను 30గా నిర్ణయించింది. అంటే ప్రతి సబ్జెక్టులో 100 మార్కులకుగాను 30 మార్కులు తెచ్చుకుంటే చాలు… పాసైనట్లే. సాధారణంగా 35 మార్కులకు పాస్‌గా పరిగణిస్తారు. కానీ బీహార్ లో మాత్రం 30 మార్కులే పాస్ మార్కులుగా నిర్ణయించారు. బిహార్‌లో గత ఫిబ్రవరి 17 నుంచి 24 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.