వ్యాక్సిన్ తీసుకుంటే.. స్మార్ట్ ఫోన్ ఉచితం
1 min readపల్లెవెలుగు వెబ్ :గుజరాత్ లోని రాజ్ కోట్ మన్సిపల్ కార్పొరేషన్ వినూత్న కార్యక్రమం మొదలుపెట్టింది. కరోన కట్టడి చర్యల్లో భాగంగా రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోని వారే లక్ష్యంగా డ్రైవ్ నిర్వహిస్తోంది. డిసెంబర్ 4 నుంచి 10 మధ్య రెండో డోసు తీసుకునే వారికి స్మార్ట్ ఫోన్ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. డ్రా నిర్వహించి లక్కీ విన్నర్ ని ఎంపిక చేయనున్నట్టు మున్సిపల్ కమిషనర్ అమిత్ అరోడా తెలిపారు. విజేతలకు 50 వేల విలువైన స్మార్ట్ ఫోన్ లు అందివ్వనున్నారు. దీంతో పాటు ఎక్కువ డోసులు అందించే అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లకు 21 వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు.