NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీ ముఖం ఇస్తే.. కోటిన్నర ఇస్తాం !

1 min read

పల్లెవెలుగు వెబ్​: మీ ముఖం ఇస్తే మీకు కోటిన్నర ఇస్తాం అంటూ ఓ కంపెనీ ప్రక‌ట‌న ఇచ్చింది. ప్రక‌ట‌న చూసి అంద‌రూ ఆశ్చర్యపోయారు. అస‌లు విష‌యం ఏంటంటే .. ఆధునిక రోబోలను ఎంత అందంగా తయారు చేసినా, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ద్వారా వాటికి మనిషి రూపాన్ని జోడించినా అందులో కృత్రిమత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ కేంద్రంగా ప‌నిచేసే ప్రోమోబోట్‌ అనే హ్యూమనాయిడ్‌ రోబోల తయారీ కంపెనీ మనిషి ముఖాన్ని అచ్చుగుద్దినట్లుండే రోబోను తయారు చేసేందుకు సిద్ధమైంది. తమ ‘క్లయింట్ల’ కోరిక మేరకు ఉత్తర అమెరికా, మిడిల్‌ఈస్ట్‌లోని వివిధ హోటళ్లు, షాపింగ్‌ మాల్స్, ఎయిర్‌పోర్టుల్లో దాన్ని ‘పని’కి కుదర్చనుంది. ఇందుకోసం ఎవరైనా తమ ముఖాన్ని రోబో తయారీలో వాడుకునేందుకు ముందుకొస్తే ఏకంగా రూ. కోటిన్నర నజరానా ఇస్తామని ప్రకటించింది. హ్యూమనాయిడ్‌ అసిస్టెంట్‌గా సేవలందించబోయే రోబోతో పర్యాటకులు మాటకలిపేలా ఆ ‘ముఖం’ కనిపించాలన్నదే షరతు అట. అలాంటి ముఖాన్ని శాశ్వతంగా రోబోపై ముద్రించేందుకు చట్టబద్ధంగా సమ్మతించిన వారికి ఈ బహుమానాన్ని ఇస్తామని కంపెనీ తెలిపింది.

About Author