NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వారానికి 5 రోజులు కోర్టుకు వ‌స్తే.. పాల‌న‌కు ఇబ్బంది : సీఎం జ‌గ‌న్

1 min read

పల్లెవెలుగు వెబ్​ : సీబీఐ కేసుల విచార‌ణ నిమిత్తం వారానికి ఐదు రోజులు కోర్టుకు హాజ‌రైతే పాల‌న‌కు ఇబ్బంది అని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. రాష్ట్రంలో ప‌లు అభివృద్ధి ప‌నులు ఆగిపోతాయ‌ని వెల్లడించారు. హాజ‌రు మిన‌హాయింపు పై సీబీఐ కోర్టులో వేసిన పిటిష‌న్లు కొట్టివేయ‌డంతో తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. పాల‌నా ప‌ర‌మైన ప‌నుల‌తో పాటు ప్రోటోకాల్ ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టుకు నివేదించారు. సీఎంగా జ‌గ‌న్ ను క‌లిసేందుకు కోర్టుకు ఎక్కువ మంది వ‌స్తార‌ని, దీని వ‌ల్ల అంద‌రికీ ఇబ్బందులు ఏర్పడుతాయ‌ని వెల్లడించారు. సీఎం కాక మునుపు ప్రతివారం కోర్టుకు హాజ‌ర‌య్యార‌ని, ప్రత్యేక సంద‌ర్భాల్లో మాత్రమే అనుమ‌తి తీసుకున్నార‌ని తెలిపారు. సీబీఐ వాద‌న‌ల నిమిత్తం విచార‌ణ ఈనెల 6కు వాయిదా వేశారు.

About Author