సినిమా ప్రచారానికి వెళ్తే.. రింగ్ తొడిగి, ప్రపోజ్ చేసింది !
1 min readపల్లెవెలుగువెబ్: విజయ్ కొత్త చిత్రం లైగర్ ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లగా, ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. తేజు అనే అమ్మాయి తన ఆరాధ్య హీరోను ఎదురుగాచూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. అంతేకాదు, దిష్టి తగలకుండా అప్పటికప్పుడు ఓ ఉంగరం తొడిగి తన ప్రేమను వెల్లడించింది. ఆమె ప్రపోజ్ చేసిన తీరు పట్ల విజయ్ సహృదయతతో స్పందించాడు. ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. అంతేకాదు, లైగర్ ప్రమోషన్లు పూర్తయ్యేదాకా ఆమె తన వేలికి తొడిగిన రింగ్ ను తీయనని మాటిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.