వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలకు…!
1 min readపల్లెవెలుగు వెబ్ : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులపై టీటీడీ ఆంక్షలు విధించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులు రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని, అది లేకపోతే దర్శన సమయానికి మూడురోజుల ముందు కరోనా పరీక్షలో నెగటివ్ అని తేలిన సర్టిఫికెట్ అయినా ఉండాలని స్పష్టం చేసింది. కొవిడ్ నియంత్రణ కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు.