ముగ్గురి కంటే ఎక్కువ సంతానం ఉంటే.. పథకాలు కట్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : కర్ణాటక ప్రభుత్వం జనాభా నియంత్రణకు కసరత్తు ప్రారంభించింది. ముగ్గురి కంటే అధిక సంతానం ఉంటే ప్రభుత్వ పథకాలు కట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వార జనాభా నియంత్రణ చర్యలు అమలు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటీ రవి ట్వీట్ చేశారు. జనాభా నియంత్రణ బిల్లును రాష్ట్రంలో అమలు చేయడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, అస్సాం కూడ ఇదే తరహా జనాభా నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నాయి.