NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీకు ఇలాంటి పాన్ కార్డ్ ఉంటే రూ. 10,000 జ‌రిమానా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక అస్సెసీకి రెండు నంబర్లు ఉండకూడదు. అలాగే ఇద్దరు వ్యక్తులకు ఒక పాన్‌ ఉండకూడదు. ఈ రెండు పరిస్థితులూ చట్టరీత్యా నేరమే. ఒక అస్సెసీకి ఒకే నంబరు ఉండాలి. ఈ నంబర్‌ శాశ్వతం. ప్రత్యేకం. మీ సొంతం. ఊరు మారినా .. ఉనికి మారినా.. నంబరు మారదు. దేశంలో ఏ మూలనున్నా ఈ నంబర్‌ మీదే. మీకే సొంతం. మీరే వాడుకోవాలి. నంబరు కోసం దరఖాస్తు చేసి, వేచి చూసి, విసిగి మరో దరఖాస్తు ఇచ్చిన వారికి రెండు నంబర్లు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు.. స్త్రీలు పెళ్లి కాక ముందు ఒక నంబరు, పెళ్లి అయ్యాక ఒక నంబరు పొంది ఉండవచ్చు. డిపార్ట్‌మెంట్‌ వారు సరిగ్గా కనుక్కోకపోవడం వల్ల పొరపాటున ఒకే అస్సెసీకి రెండు రెండు వేరు నంబర్లు, లేదా కార్డులు జారీ చేసి ఉండవచ్చు. కనుక ఇలాంటి పాన్‌ కార్డులు ఉంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఒక అస్సెసీకి రెండు వేరు వేరు నంబర్లు ఉంటే సెక్షన్‌ 272బీ ప్రకారం పెనాల్టీ వేస్తారు. పెనాల్టీ మొత్తం రూ. 10,000.

                          

About Author