కాంగ్రెస్ లోని చేరినా.. కేసీఆర్ తో పనిచేస్తాం !
1 min readపల్లెవెలుగువెబ్ : తాను కాంగ్రెస్‌లో చేరినా తన ఐప్యాక్ సంస్థ టీఆర్ఎస్ కోసం పని చేస్తుందని కేసీఆర్‌కు ప్రశాంత్‌కిషోర్ తెలిపారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఆయన.. జాతీయ రాజకీయాలపై చర్చించారు. బీజేపీని ఢీకొట్టడంపైనా ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. మూడోకూటమి ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ను కలుపుకుపోవాలనే విషయంపై ఆలోచించాలని కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్ కోరారు. బీజేపీ వ్యతిరేకశక్తులన్నీ ఏకమైతేనే ఆ పార్టీని గద్దె దింపగలమని కేసీఆర్‌కు ఈ సందర్భంగా పీకే వివరించారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించనున్నారని పీకే స్పష్టం చేయడంతో కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.