బాటిల్ ఎత్తితే.. దించకుండా తాగేవాడిని !
1 min readపల్లెవెలుగువెబ్ : బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ 57వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఇటీవల తన కుటుంబం, ఆధ్యాత్మికత, మతం వంటి తదితర అంశాలపై మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో తనకున్న మద్యం అలవాటు గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. నేను ఇంతకుముందు అప్పుడప్పుడు డ్రింక్ చేసేవాడిని. కొంతమంది రెండు పెగ్గులు తీసుకుంటారు. కానీ రెగ్యూలర్గా తాగుతారు. నేను అలాంటి వాళ్లలో ఒకరిని కాదు. నేను అకెషనల్గా అప్పుడప్పుడు మాత్రమే తాగేవాడిని. కాకపోతో తాగడానికి కూర్చున్నప్పుడు బాటిల్ మొత్తం పూర్తి చేసేవాడిని. అది కొంచెం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మీరు మత్తులో ఉన్నప్పుడు ఏవైనా రిగ్రీట్ ఫీల్ అయ్యేటువంటి పనులు చేశారా అని ఆలోచించుకోవాలి. నేనైతే అలా ఏం చేయలేదు. కానీ మనం సొంత నియంత్రణను కోల్పోవడమనేది నాకు నచ్చలేదు. అందుకే ఇకపై నేను తాగను.’ అని అమీర్ ఖాన్ తెలిపాడు.