ఇష్టపడి చదివితే- ఉన్నత శిఖరాలకు చేరవచ్చు
1 min read– వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ ..జి ఎన్
పల్లెవెలుగు వెబ్చెన్నూరు : విద్యార్థులు కష్టపడి చదవడం కన్నా , ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరవచ్చు అని తద్వారా కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువుల రుణం తీర్చుకోవడమే కాకుండా, సమాజానికి ఎంతో ఉపయోగపడతారని వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్, భాస్కర్ రెడ్డి అన్నారు, సోమవారం సాయంత్రం శ్రీ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలను పాఠశాల యందు పాఠశాల కరస్పాండెంట్ సి. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, విద్యార్థులందరూ విద్యార్థి దశ నుండే మంచి అలవాట్లను అలవర్చుకోవాలని, దీంతో సమాజం పట్ల, ఎంత కొంత అవగాహన ఏర్పడుతుందని ఆయన తెలియజేశారు, అనంతరం వేదాస్ పాఠశాల కరస్పాండెంట్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ, నేటి యువత సెల్ఫోన్ మోజులో పడి, కొంత విద్యాభ్యాసానికి దూరం కావడం జరుగుతుందని, అలా కాకుండా విద్యార్థి దశ నుండి, మంచి అలవాట్లను అలవచుకుంటే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు చేరతారని తెలియజేశారు, ఎస్సై శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, నేటి సమాజంలో విద్యకు ఉన్న గౌరవం ఎలాంటిదో, విద్య లేకపోతే ఉన్న గౌరవం ఎలాంటిదో విద్యార్థులకు వివరించడం జరిగింది, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ మాట్లాడుతూ, విద్యా పేదరికానికి అడ్డు కాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగింది అన్నారు, అందుకు తగ్గట్టు విద్యార్థులు మంచి విద్య అభ్యసించి తల్లిదండ్రులకు సమాజానికి ఎంతో పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుతో పాటు 2021- 22 సంవత్సరంలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.