తప్పు చేస్తే .. ఉపేక్షించేది లేదు
1 min read
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: తప్పు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని సిఐ శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా ప్యాపిలి పోలీసు స్టేషన్ లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పించడమే మా రక్షకభటుల ధ్యేయమని అలాగే ప్రజానీకానికి సమస్యలు తెచ్చిపెట్టే వారి పైన గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని,ప్యాపిలి మండలంలో అసంఘీత కార్యకపాలు మద్యంసేవించుట ,సార విక్రయించుట, మటక ,పేకాట జూదంలో వున్నవారిని ఎంతటి వారినైనా ఉక్కు పాదం మెపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి ఘర్షణలు , వాగ్వాదానాలు దూరంగా వుంటు ప్రశాంతమైన జీవితం గడపాలని తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ మానవ దృపాదానికి నాంధీ పలకాలని ఆయన కోరారు.