సిద్దార్థ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తాం..
1 min read– టీడీపీ నాయకులకు సిద్దార్థ పేరు ఉచ్చరించే అర్హత లేదు.
– ముస్తఫా నోరు అదుపులో పెట్టుకో..
– యూట్యూబ్ హీరోలుగా ఎదగడానికి బైరెడ్డి పేరును వాడుకుంటున్నారు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నాయకుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకలు కోస్తామని వైసీపీ పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు ఉమ్మడి జిల్లాల మైనారిటీ సెల్ జోనల్ ఇంఛార్జ్ అబూబక్కర్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు జబ్బార్, కౌన్సిలర్ లు హమీద్ మియ్య, అబ్దుల్ రవూఫ్, నాయబ్, ఉస్మాన్ బేగ్, మన్సూర్ లు టీడీపీ నాయకుల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం అల్లూరు గ్రామం టిడిపి నాయకుడు మాండ్ర శివానంద రెడ్డి నివాసంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూనందికొట్కూరు పట్టణ ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి నాయకుడిగా ప్రజల మన్ననలు పొందిన నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. మా నాయకుడిని బచ్చా అన్నా టిడిపి మోమిన్ ముస్తఫా ఓ లుచ్చా..అర్హత తెలుసుకోకుండా మాట్లాడితే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు.నియోజవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ఏకైక నాయకుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. సింహంలా ఒక్కరోజైనా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాగా బ్రతకాలన్నారు. మీ నాయకుడు గౌరు కుటుంబ చరిత్ర తెలుసుకో. జీవిత కాలపు శిక్ష అనుభవించిన మీ నాయకుల స్వార్థం కోసం పట్టణాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర మీదని ఆరోపించారు.బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి తెలుసుకోకుండా అవాక్కులు చెవాకులు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని తాట తీస్తామని టిడిపి నాయకులను హెచ్చరించారు. టిడిపి పార్టీకి చెందిన మోమిన్ ముస్తఫా కు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని విమర్శించే అర్హత లేని ఆనామాకుడని విమర్శిస్తే సహించేది లేదంటూ మండిపడ్డారు. నమ్ముకున్న కార్యకర్తలను ప్రోత్సహించే తత్వం కలిగిన మంచి మనసున్న గొప్ప నాయకుడు మా సిద్ధార్థ రెడ్డిఅన్నారు.అంతేకాకుండా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం.. నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న నాయకుడు సిద్ధార్థ అని పేర్కొన్నారు. వైఎస్సార్ భిక్షతో రాజకీయ పదవులను అనుభవిస్తూ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వెన్నుపోటు పొడిచి ఊసరవెల్లి రాజకీయాలు నడుపుతున్న చరిత్ర మీ నియోజకవర్గ టిడిపి నాయకులదన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.మీ నాయకుడి బంధువులు ఎస్టీ మహిళపై అత్యాచారం చేసి చంపిన చరిత్ర ఉందని అది తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. టిడిపి పాలనలో తమ స్వార్థం తన బావ రాజకీయ ఉనికి కోసం కౌన్సిలర్లను అమ్మి వేసిన చరిత్ర వారిది అని ధ్వజమెత్తారు. పట్టణ రోడ్డు వెడల్పు విస్తరణలో భాగంగా వ్యాపార సముదాయాలను పడగొట్టి పట్టణ ప్రజలను, నిలువు దోపిడీ చేసిన చరిత్ర మీ టిడిపి నాయకులదేనన్నారు. గత ఎన్నికలలో సింహంలా సింగిల్ గా ప్రత్యర్థులపై నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ను నిలబెట్టి గెలిపించుకున్న చరిత్ర బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిదే అని గుర్తుచేశారు. నమ్ముకున్న పార్టీ కోసం.. నమ్మిన కార్యకర్తల కోసం నియోజవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న వ్యక్తి సిద్ధార్థ రెడ్డి మాత్రమేనని ప్రజల్ని ఎవరిని అడిగినా చెపుతారన్నారు.ఈ సమావేశంలో పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు ,షేక్షావలి. ఉస్మాన్, శాలు, బి.యస్.ఆర్ టీమ్ పాల్గొన్నారు.