ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే.. 25 లక్షల బీమా !
1 min readపల్లెవెలుగు వెబ్ : సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొత్త పొదుపు ఖాతా పథకాన్ని తీసుకొచ్చింది. సంపద వృద్ధితో పాటు బీమా రక్షణను కల్పించేలా ఈ ప్రత్యేక ఖాతా రూపొందించారు. దీనికి సూర్యోదయ హెల్త్ అండ్ వెల్ నెస్ సేవింగ్స్ అకౌంట్ గా పేరు పెట్టారు. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పాటు కుటుంబ సభ్యులకు ఉచిత బీమా, ఆరోగ్యం సంరక్షణ, అపరిమిత ఏటీఏం లావాదేవీలు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అకౌంట్ నిబంధనల ప్రకారం ఖాతా తెరిచే వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి. వ్యక్తిగత లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఖాతాలో కనీసం నెలకు 3 లక్షల బ్యాలెన్స్ ఉండాలి. ఈ ఖాతా తెరిస్తే అకౌంట్ ఓపెన్ చేసిన వ్యక్తితో పాటు భార్య, పిల్లలకు కలిపి 25 లక్షల టాప్ అప్ ఆరోగ్య బీమా వస్తుంది. ఇక్కడ ఐదు లక్షలు డిడక్టబుల్. అంటే మీ హాస్పిటల్ ఖర్చు ఐదు లక్షలు మించితేనే టాప్ అప్ ఆరోగ్య బీమా కింది క్లైం చేసుకోవచ్చు.