NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్విగ్గీ, జొమాటోల్లో ఫుడ్ ఆర్డ‌ర్ చేస్తే.. టాక్స్ క‌ట్టాల్సిందే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున ఆన్ లైన్ ఫుడ్ డెలివ‌రీ బిజినెస్ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆన్ లైన్ ఫుడ్ ఆర్డ‌ర్ పై ఎలాంటి జీఎస్టీ లేదు. అయితే కొత్త సంవ‌త్స‌రంలో కచ్చితంగా జీఎస్టీ చెల్లించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు స్విగ్గీ, జోమాటో సేవలపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. క్లౌడ్ కిచెన్‌లు, సెంట్రల్ కిచెన్‌లు అందించే సేవలు రెస్టారెంట్ సర్వీస్ కింద కవర్ చేస్తూ శనివారం నుంచి ఐదు శాతం సేవల పన్ను చెల్లించాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఆదేశించింది. ఈ మేర జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ పన్ను చెల్లించని రెస్టారెంట్లపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్రం హెచ్చరించింది.

                                         

About Author