ఈ పరీక్ష పాసైతే.. 151కోట్ల స్కాలర్ షిప్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థ అప్ గ్రాడ్. ఈ సంస్థకు చెందిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ అప్ గ్రాడ్ జీత్.. 151 కోట్ల స్కాలర్ షిప్ అందించే పరీక్షను నిర్వహించబోతోంది. ఈనెల 8న జరగబోయే ఈ పరీక్షకు ఇప్పటికే 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రిలిమినరీ, మెయిన్స్ రెండు రౌండ్లుగా పరీక్ష ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాలు నిర్వహించేందుకు NRA CET టెస్ట్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు కోచింగ్ ఇచ్చేందుకు అప్ గ్రాడ్ జీత్ .. జీత్ సీఈటీ టెస్ట్ నిర్వహించి భారీ స్కాలర్ షిప్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని.. మెయిన్స్ ఎగ్జామ్ కు ఆహ్వినిస్తారు. రెండో రౌండ్లో అర్హత సాధించిన వారిలో 3 వేల మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వారికి ఆరు నెలల ఎన్ఆర్ఏసిఈటీ టెస్ట్ కోచింగ్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తారు.