ఈ పరీక్ష పాసైతే.. రూ. లక్ష 25 వేల స్కాలర్ షిప్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టీస్ అండ్ ఎంపవర్‌మెంట్ విద్యార్ధులకు సువర్ణ అవకాశాన్ని కల్పించింది. అర్హులైన విద్యార్ధులకు ఏడాదికి రూ.75వేల నుంచి రూ.లక్షా 25 వేల వరకు స్కాలర్ షిప్‌ను అందించేందుకు సిద్ధమమైంది. ఇందులో భాగంగా ప్రతిభావంతులైన 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న అథర్ బ్యాక్ వర్డ్ క్లాస్ (ఓబీసీ) డి-నోటిఫైడ్, సంచార, సెమీ-సంచార (డీఎన్‌టీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) కేటగిరీల విద్యార్ధుల్ని ఎంపిక చేయనుంది.