PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత‌డిని ప‌ట్టిస్తే 10 ల‌క్షల బ‌హుమ‌తి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సైదాబాద్ లోని ఆరేళ్ల బాలిక‌పై అత్యాచారం కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడిని ప‌ట్టుకునేందుకు సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. నిందితుడిని ప‌ట్టించిన‌వారికి 10 ల‌క్షల రివార్డు ఇస్తామ‌ని ప్రక‌టించారు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 9490616366 నెంబ‌రుకు స‌మాచారం ఇవ్వాల‌ని కోరారు. పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం కొన్ని ఆన‌వాళ్లతో కూడిన స‌మాచారం పోలీసులు విడుద‌ల చేశారు. నిందితుడి రెండు చేతుల‌పై మౌనిక అని టాటూ ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

About Author