మీ ఇంటి ముందు ‘To-let’ బోర్డ్ పెడితే.. 2 వేల జరిమానా !
1 min readపల్లెవెలుగు వెబ్ : మీ ఇంటి ముందు టూలెట్ బోర్డు పెడితే జరిమానా. ఇది విని షాక్ అవుతున్నారా ?. నిజం అనుమతి లేకుండా టూలెట్ బోర్డు పెడితే అది నేరంగా పరిగణిస్తోంది జీహెచ్ఎంసీ. జీహెచ్ఎంసీ పరిధిలో అనుమతి లేకుండా టూలెట్ బోర్డు పెడితే 2 వేల రూపాయలు జరిమానా విధిస్తున్నారు. అనుమతి లేకుండా ఇలాంటి బహిరంగ ప్రకటనలు ఇవ్వడం పై నిషేధం ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. మూసాపేట పరిధిలోని ఓ యజమాని తన షాప్ ఖాళీ అవ్వడంతో టూలెట్ బోర్డు తగిలించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు దీనిని నేరంగా పరిగణిస్తూ 2 వేల రూపాయలు జరిమానా విధించారు. 24 గంటల్లో ఈ-చలానా ద్వార చెల్లించాలని ఆదేశించారు. అయితే.. ఇలాంటి నిబంధన ఒకటి ఉందని చాలా మంది ప్రజలకు తెలియదని, దీని గురించి జీహెచ్ఎంసీ అవగాహన కల్పించిన దాఖలాలు లేవని నగర పౌరులు చెబుతున్నారు.