ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే.. నెలకు రూ. 1000 !
1 min readపల్లెవెలుగువెబ్ : తమిళనాడు ప్రభుత్వం వినూత్న పథకం ప్రకటించింది. 6వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉన్నత చదువులకు వెళ్లే బాలికలకు ఇకపై నెలకు రూ.1000 చొప్పున అందజేయనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థికమంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ పథకం గురించి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 6 లక్షల మంది లబ్ధి పొందుతారని తెలిపారు.