NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గూగుల్ లో.. ఈ మూడు వెతికితే జైలుకే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌స్తుత డిజిట‌ల్ ప్ర‌పంచంలో ఏ చిన్న సందేహం వ‌చ్చినా గూగుల్ లో వెత‌క‌డం సాధారణం అయింది. అయితే.. కొన్ని విష‌యాలు వెతికితే మాత్రం జెల్లో ఊచ‌లు లెక్కించాల్సిందే. చైల్డ్‌ పోర్నోగ్రఫి..చిన్నారులకు సంబంధించి పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గూగుల్‌లో వెతికితే శిక్షార్హులవుతారు. పొరపాటున సెర్చ్‌ చేసినా పోక్సో చట్టం కింద జైలు ఖాయం అవ్వొచ్చు. ఈ నేరం కింద 5 నుంచి ఏడేళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బాంబుల తయారీ.. బాంబులను ఎలా తయారు చేయాలని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే చిక్కులు తప్పవు. ఇటువంటి కంటెంట్‌ను వెతికినవారిని సెక్యురిటీ సంస్థలు గుర్తిస్తాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అబార్షన్‌.. అబార్షన్‌ చేయడమెలా? అని గనుగ గూగుల్‌లో వెతికితే కటకటాలు తప్పవు. గర్భస్రావాలను నిరోధించేందుకు భారత్‌ గట్టి చట్టాలను రూపొందించింది. అబార్షన్‌కు సంబంధించిన కంటెంట్‌ను సెర్చ్‌ చేస్తే భారతీయ చట్టాల ప్రకారం శిక్షార్హులు. డాక్టర్‌ అనుమతితోనే గర్భస్రావానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి.

                                       

About Author