ఈ పిజ్జాను చూస్తే.. జీవితంలో మళ్లీ తినరు !
1 min readపల్లెవెలుగువెబ్ : పిజ్జా అంటే గుర్తుకు వచ్చే పేరు డొమినోస్. టేస్ట్‌తో పాటు క్వాలిటీ కూడా మెండుగా ఉంటుందని కస్టమర్లు అక్కడికి ఎగబడుతుంటారు. అయితే బెంగళూరులోని డొమినోస్ ఫ్రాంచైసీ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా ఆ సంస్థ పేరును మసక బారేలా చేస్తోంది. హోసా రోడ్‌లో ఉన్న డొమినోస్ అవుట్‌లెట్‌లో పిజ్జా తయారీ కోసం సిబ్బంది పిండి తయారు చేశారు. కాకపోతే ఆ పిండిపై నిర్లక్ష్యంగా టాయిలెట్ బ్రష్‌లు, ఫ్లోర్ క్లీనింగ్ వస్తువును ఉంచారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు.. ఇదేనా మీ క్వాలిటీ పుడ్ అని డొమినోస్ సంస్థ పై మండిపడుతున్నారు.