NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే.. ప్రోత్సాహక బహుమతి

1 min read

– ఎన్.ఆర్.ఐ గోరాన్ చెరువు వేణుగోపాల్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన వంతు సహాయం చేస్తానన్నారు ఎన్.ఆర్.ఐ గోరాన్ చెరువు వేణుగోపాల్ రెడ్డి. గాలివీడు మండలం గోరాన్​చెరువుకు చెందిన ఎన్​ ఆర్​ఐ వేణుగోపాల్​ ప్రభుత్వ పాఠశాలలలో పదో తరగతి చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు రూ5,116 నగదు బహుమతి అందజేస్తానని హామీ ఇచ్చారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు ( స్కూల్​ఫస్ట్​) సాధించిన బాల,బాలికలకు నగదు బహుమతి అందజేస్తామన్నారు. శ్రీమతి పోలా శ్రీదేవి జ్ఞాపకార్థం రాయచోటి తాలూకా ఉత్తమ ప్రతిభ అవార్డు అనే పేరుతో ఇవ్వనున్నట్లు తెలియజేశారు. రాయచోటి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాద్యాయులతో కలిసి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయడమే కాకుండా వారి ఉన్నతి కోసం స్వచ్చంద సంస్థల సభ్యులు సహకారం కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.

About Author