NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాళ్లు రువ్వితే ఉద్యగ‌మివ్వరు.. పాస్ పోర్ట్ రాదు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : రాళ్లు రువ్వినా.. విద్రోహ‌క చ‌ర్యల్లో పాల్గొన్న అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా చేయాల‌ని జ‌మ్మూకశ్మీర్ పోలీసు విభాగం ఆదేశాలు జారీ చేసింది. అలాంటి వారికి పాస్ పోర్డ్ కూడ రాకుండా చేయాల‌ని పేర్కొంది. దేశ భ‌ద్రత‌కు ముప్పు క‌లిగించే వ్యవ‌హారాల్లో పాల్గొనే వారు విదేశాల‌కు వెళ్లే అవ‌కాశ‌మే ఉండ‌కూడ‌ద‌ని స్పష్టం చేసింది. ఈ మేర‌కు సీఐడీ స్పెష‌ల్ బ్రాంచ్ అధికారులు అన్ని విభాగాల‌కు ఆదేశాలు జారీ చేశారు. పాస్ పోర్ట్, ఉద్యోగాల‌కు సంబంధించిన దృవ‌ప‌త్రాలు ప‌రిశీల‌న స‌మ‌యంలో ఇలాంటి విష‌యాలు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాల‌ని పేర్కొంది. సీసీ టీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించాల‌ని స్పష్టం చేసింది. స్థానిక పోలీస్ స్టేష‌న్ రికార్డుల్లోనూ దీన్ని ధృవీకరించుకోవాల‌ని సీఐడీ పేర్కొంది.

About Author