నకిలీ హెల్మెట్ వాడితే జరిమాన..ఈ మార్క్ తప్పనిసరి !
1 min readపల్లెవెలుగు వెబ్: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చాయి. రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం పైగా తలగాయాలతోనే మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలనే నిబంధనను ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. అయితే.. మంచి నాణ్యత గల హెల్మెట్ ధర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కొనుగోలు చేయాలంటే కొందరు ఇష్టపడరు. మరోవైపు ఇది గమనించిన కొన్ని కంపెనీలు నకిలీ హెల్మెట్ లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అంటే నాణ్యత లేని హెల్మెట్స్ అన్నమాట. వీటిని ధరించినా కూడ రోడ్డు ప్రమాదాల్లో తలకు బలమైన గాయాలు అవుతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త సర్క్యులర్ జారీ చేసింది. బీఐఎస్ సర్టిఫికేషన్, ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్ లను మాత్రమే వాడాలని సూచించింది. అటువంటి హెల్మెట్లనే మార్కెట్లోకి తీసురావాలని తయారీ సంస్థలను కూడ నిర్దేశించింది. బీఐఎస్ సర్టిఫికేషన్, ఐఎస్ఐ మార్కులేని హెల్మెట్లను వాడితే జరిమానా విధించాలని పోలీసులను ఆదేశించింది. నాసిరకం హెల్మెట్లను అమ్మే వ్యాపారుల మీద కూడ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.