బాబు పార్టీకి ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి.. ఆలోచించుకోండి
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: బాబు పార్టీకి ఓటేస్తే జగనన్న ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న రుణాలకు రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానం ఎంతవరకు నెరవేరింది అన్నారు. దీనివల్ల రైతులు మహిళలు మోసపోయారని బ్యాంకుల మెట్లు ఎక్కడానికి కూడా అవకాశం లేకుండా పోయిందన్నారు. కన్నీళ్లు తుడిచేందుకు మహిళా పొదుపు సంఘాల వారికి సంఘానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి చంద్రబాబు మహిళలను మోసం చేయాలని తిరిగి అధికారంలోకి రావాలని ఆశించగా మహిళలు దానిని తిప్పి కొట్టి జగనన్నకు జై కొట్టారన్నారు. అదేవిధంగా కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటేస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతాడని తెలిపారు. అప్పుడు మరల అనేక సంక్షేమ పథకాలు అందించడానికి ఆస్కారం ఉంటుందని మీ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడానికి మీకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జగనన్న సురక్ష పథకంలో భాగంగా 11 రకాల సర్టిఫికెట్లతో పాటు ఇతర వాటినే ఒక్కరోజులో దరఖాస్తు చేసుకున్న వెంటనే జగనన్న సురక్ష కార్యక్రమంలో అందించిన ఘనత జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జగనన్న ప్రభుత్వం మీకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా. గతంలో ఎవరైనా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టారా అని ప్రశ్నించారు. జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు మీరు పొంది ఉంటే మరలా అలాంటి పథకాలు పొందాలనుకుంటే నన్ను గెలిపించాలని త ద్వారా జగన్ ముఖ్యమంత్రి అవుతారని మీకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సూచించారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ బాలునికి చికిత్స నిమిత్తం అవసరమయ్యే ఖర్చులు తానే భరిస్తానని మీరు ఏ వైద్యశాలలో బాలుడిని చేర్పించి చికిత్స అందించిన అందుబాయే ఖర్చులు మొత్తాన్ని తాను బరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రత్యేక అధికారి చింతామణి గ్రామ సర్పంచ్ శ్రీలక్ష్మి ఎంపీటీసీ మహేశ్వరుడు జడ్పిటిసి కే మహేశ్వర్ రెడ్డి గ్రామ వైసిపి నాయకులు ఒంటెద్దు వీరారెడ్డి నాగభూపాల్ రెడ్డి మండల సమన్వయకర్త భువనేశ్వర్ రెడ్డి తాసిల్దార్ జనార్దన్ శెట్టి ఇన్చార్జి ఎంపీడీవో నాగ శివ నాగ జ్యోతి ఎంఈఓ రామసుబ్బయ్య మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరెడ్డి డిప్యూటీ తాసిల్దారు శ్రీనివాసులు పి ఆర్ ఏ ఈ రమణ మహానంది దేవస్థానం చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.