చీర కావాలో.. చుడీదార్ కావాలో టీడీపీ నేతలు తేల్చుకోవాలి !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబే పెద్ద ఉన్మాదని అన్నారు. టీడీపీ నేతలు సీఎం జగన్ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని, చర్యలు తీసుకుంటామని అన్నారు. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు.. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ చీరలు కట్టుకోవాలన్నారు. చీర కావాలో.. చుడిదార్ కావాలో టీడీపీ నేతలు తేల్చుకోవాలన్నారు. టీడీపీ మహిళ ద్రోహి పార్టీ అని రోజా తీవ్రస్థాయిలో విమర్శించారు.