PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెట్రోల్, డీజిల్ కావాలంటే .. ఆ సర్టిఫికేట్‌ ఉండాలి

1 min read

పల్లెవెలుగువెబ్ : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉంది ఢిల్లీ సర్కారు. అందులో భాగంగా పొల్యుషన్‌ అండర్‌ చెక్‌ సర్టిఫికేట్‌ (పీయూసీసీ) ఉన్న వాహనాలకే ఫ్యూయల్‌ బంకుల్లో పెట్రోలు , డీజిల్‌ పోయాలనే చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్టు ఆ రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ తెలిపారు. ఫ్యూయల్‌ కోసం బంకుల్లోకి వచ్చే వాహనదారులు తప్పని సరిగా పొల్యుషన్‌ సర్టిఫికేట్‌ తమతో పాటు తెచ్చుకోవాలి. లేదంటే బంకుల్లో ఉండే పొల్యుషన్‌ టెస్టింగ్‌ కేంద్రాల దగ్గరు వెళ్లి ఈ సర్టిఫికేట్‌ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పెట్రోలు లేదా డీజిల్‌ను కొనేందుకు అనుమతి ఇస్తారు.

   

,

About Author