ఈ కూరగాయ కొనాలంటే కిలోకి లక్ష వెచ్చించాల్సిందే !
1 min readపల్లెవెలుగువెబ్ : “హాప్ షూట్స్“ ఈ కూరగాయ కొనాలంటే కిలోకి రూ. లక్ష చెల్లించాల్సిందే. ఈ కాయగూరల పువ్వులను హాప్ కోన్స్ అంటారు. వీటిని బీర్ తయారీలో ఉపయోగిస్తారు. మిగిలిని కొమ్మలను కూరగాయాలుగా వాడుకుంటారు. ఈ కాయగూర మొక్క కాండాన్ని కూడా ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇటీవలే ఇప్పుడిప్పుడే ఈ కాయగూరలను తినేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు ఈ కాయగూరని బిహార్‌లోని ఒక యువకుడు పండిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాప్ షూట్స్‌ని భారత్‌లోని బిహార్‌కి చెందిన తొలి యువ రైతు అమ్రేష్ సింగ్ సాగు చేస్తుండటం విశేషం.