NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఛార్జీల భారం తగ్గాలంటే.. బాబు రావాలి..

1 min read

టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ

పల్లెవెలుగు వెబ్​, కమలాపురం: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పెంచిన పన్నుల ఛార్జీల భారం తగ్గాలంటే రాడైరా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటేనే సాధ్యమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు కమలాపురం పట్టణం వికలాంగుల కాలని  గండ్లూరు కాలనిలో సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు   ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఇంటిటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ పాలన లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను  ప్రజలకు వివరిస్తూ చైతన్య పరిచారు కొన్ని చోట్ల ప్రజలు ఈ ముఖ్యమంత్రి మాకొద్ధంటు  సాయినాథ్ శర్మ తో చెప్పారు ఈ సందర్భంగా సత్య సాయినాథ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అవలంబిస్తున్న నిరంకుశ విధానాలు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు రోజురోజుకు తీవ్రతరం అవుతుందని అన్నారు ప్రస్తుతం పెంచిన  ఆర్ టి సి బస్ చార్జీలు  ఛార్జీలు ప్రజలకున్న భారమై ప్రజలు ఇబ్బందులు పడుతున్న ముఖ్యమంత్రి పైశాచికానందం పొందడం శోచనీయం అన్నారు ప్రజల సొమ్మును సొంత వ్యక్తిగత ప్రచారం కోసం పార్టీ ప్రచారం కోసం దుర్వినియోగం చేసి ప్రజలను స్వార్థానికి వాడుకుంటు దేశంలోనే ఈ దేశంలోనే స్వార్థ విధానాలు గల మొట్టమొదటి ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి చరిత్ర పుటలకు ఎక్కుతున్నారన్నారు  ప్రజలపై భారీగా చార్జీల భారం మోపిన ముఖ్యమంత్రికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్న మ వుతోందన్నారు తెలుగు యువత కార్యదర్శి నవీన్ రైతు సంఘం నాయకుడు కల్లూరు జనార్దన్ రెడ్డి తెలుగుదేశం నాయకులు నాగేంద్ర రెడ్డి శివారెడ్డి   బీసీ నాయకులు మహేష్  వికలాంగుల సంక్షేమ సంఘం నాయకుడు జయన్న ఎస్సీ సంఘ నాయకులు  తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author