NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజీనామా చేయాల‌నుకుంటే.. తెదేపా వాళ్లు చేయండి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాల‌నుకుంటే చేయ‌వ‌చ్చని ప్రభుత్వ స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ప్రతి అంశం వైకాపా స‌భ్యుల రాజీనామా ఎందుకు డిమాండ్ చేస్తున్నార‌ని ప్రశ్నించారు. ప్రతిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి.. వాటిని ఆమోదించుకున్నార‌ని గుర్తుచేశారు. వైకాపాకు స‌వాల్ విసిరే బ‌దులు త‌న ఎంపీల‌తో చంద్రబాబు రాజీనామా చేయించాల‌ని అన్నారు. కోర్టులు ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ అంశాన్ని ఏ కోణంలో చూశాయో త‌మకు తెలియ‌ద‌ని, అమ‌రావ‌తి మాత్రం పెద్ద కుంభ‌కోణ‌మ‌ని ప్రజ‌లు అనుకుంటున్నార‌ని స‌జ్జల చెప్పారు. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు వెనుక ఉన్నది చంద్రబాబేన‌న్న విష‌యం అంద‌రికీ తెలుస‌న్నారు.

About Author