మీ గుండె వందేళ్లు భద్రంగా ఉండాలంటే.. ఇలా చేయండి
1 min read
Anatomical heart isolated. Heart diagnostic center sign. Human heart cartoon design. Vector image.
పల్లెవెలుగు వెబ్ : భోజనం తర్వాత బంగాళాదుంప, అరటి పళ్ల చిప్స్ తింటే గుండె జబ్బు వచ్చే అవకాశం పెరుగుతుందని ఓ అధ్యయనం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురితమైంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, పప్పు దినుసులతో కూడిన పోషకాహారం సరైన సమయంలో తీసుకోవడం ద్వార గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనంలో పాలిష్ పట్టిన ధాన్యం, ఘన రూపంలోని కొవ్వు, జున్ను, అధిక చక్కెరలు, మాంసంతో కూడిన వెస్ట్రన్ ఫుడ్ తినేవారిలో శ్వాసకోశ, గుండె సంబంధ వ్యాధులతో చనిపోయే సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అలా కాకుండా మధ్యాహ్న భోజనంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పెరుగు, నట్స్ తీసుకునేవారిలో గుండె సంబంధిత రోగాలతో చనిపోయే అవకాశాలు 34 శాతం తక్కువ. రాత్రి భోజనంలో కూరగాయలు, పప్పుదినుసులు తీసుకునే వారిలో గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయే వారి సంఖ్య 23 శాతం తక్కువ.