PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ సినిమా చూస్తే లీట‌ర్ పెట్రోల్ ఫ్రీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త‌మిళ్ హీరో విజ‌య్ న‌టించిన బీస్ట్‌ మూవీ చూసేందుకు థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాయి. ఫస్ట్‌షో చూసిన వారికి విరుద్‌ నగర్‌లోని రాజా లక్ష్మీ, అమ్రితారాజ్‌ థియేటర్లు ఒక లీటరు పెట్రోల్‌ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే దీనికి వారు ఓ కండిషన్‌ కూడా పెట్టారు. ఎఫ్‌డీఎఫ్‌ఎస్‌(ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో) కోసం ఎవరైతే 5 టికెట్లు కొంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాగా ఈ థియేటర్లో ఫస్ట్‌ షోను ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రదర్శించారు. ఒక ఎఫ్‌డీఎఫ్‌ఎస్‌ టికెట్‌ ధర రూ. 500 ఉండగా మిగతా థియటర్లో రూ. 400 నుంచి రూ. 300లుగా ఉంది.

                                      

About Author