PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిజాలు రాస్తే దాడులు చేస్తారా…

1 min read

– విలేకరి పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  నంద్యాల జిల్లా మహానంది మండలం పనిచేస్తున్న వార్త విలేకరి మధు పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే, ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సర్కిల్లో విలేకరులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఏఎస్ఐ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఎల్లాసుబ్బయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత విలేకరులపై దాడులు పెరిగాయని, విలేకరులకు రక్షణ కరువైందన్నారు. నంద్యాల జిల్లా మహానంది వార్త విలేఖరి మధు పై మండల వైసిపి నాయకులు దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. పత్రికారంగా స్వేచ్ఛ హారిస్తున్నారని, జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. విలేకరులకు తక్షణమే భద్రత కల్పించాలని, దాడుల నివారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జున నాయుడు, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ పాణ్యం నియోజవర్గ ఉపాధ్యక్షుడు మహబూబ్ బాషా, శ్యాంసుందర్ రెడ్డి, ఎల్లసుబ్బయ్య, మహమ్మద్ సలేహా, మహేష్ బాబు, అరుణ్ భాష, మస్తాన్, రఫీ, రాజేష్, లీవికుమార్, రాముడు, చెన్నయ్య పాల్గొన్నారు.

About Author