మీ వాహనానికి ఈ రిజిస్ట్రేషన్ ఉంటే… దేశం మొత్తం తిరగొచ్చు !
1 min readపల్లెవెలుగు వెబ్ : వెహికల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రాలకు బదిలీ అయినప్పుడు వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ‘ బీహెచ్’ సిరీస్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది. ఈ విధానం ద్వార వ్యక్తిగత వాహనాలకు రాష్ట్రం మారినప్పుడు మరోసారి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం తప్పుతుంది. తాజాగా కేంద్ర రోడ్డు రవాణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు ఈ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని స్వచ్చందంగా ఉపయోగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా వెళ్లేందుకు వీలుపడుతుందని కేంద్రం తెలిపింది. ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసిన వాహనాన్ని వేరే రాష్ట్రంలో గరిష్ఠంగా 12 నెలలు మాత్రమే నడిపే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ రాష్ట్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన ఈ నిబంధన చాలా మంది ఉద్యోగులకు ఊరటనిస్తుంది.