ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు…మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
1 min read
కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా కర్నూల్ నగరం లోని రాయల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హాజరైన కర్నూల్ నగర ముస్లిం సోదరులు….పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా కర్నూలు నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు, నమాజ్, డిన్నర్ భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఇఫ్తార్ విందుకు వైస్సార్సీపీ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , సీనియర్ నాయకులు మొయిజ్ ఖాన్ ,సిపిఎం నాయకులు పుల్ల రెడ్డి,మాజీ చైర్మన్లు, వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్పొరేటర్లు,ముస్లిం మత పెద్దలు, ఇతర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
