PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాలకుర్తి తిక్కరెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

1 min read

– ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి
పల్లెవెలుగు వెబ్ కోసిగి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నియమ నిష్ఠలతో నిర్వహించుకునే ఉపవాస దినాలలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి గారు ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు ఈ ఇఫ్తార్ కోసిగిలో ఉన్న మహబూబియా నురాని మసీదులో ఘ‌నంగా జ‌రిగింది ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలో ఉన్నటువంటి వారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన పాలకుర్తి తిక్కరెడ్డి గారికి ముస్లీంల తరుపున అభినందనలు తెలియజేశారు పాలకుర్తి తిక్కరెడ్డి గారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్‌ విందు మత సామరస్యానికి నిదర్శనం ప్రతి ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో కఠినంగా *ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులు అందరూ ఆనందంగా ఉండాలని అందుకు అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు అల్లా ఆశీస్సులు పాలకుర్తి తిక్కారెడ్డి గారికి మరియు వారి కుటుంబనికి నిత్యం ఉండాలని రాబోయే రోజుల్లో అన్న గారు ఎమ్మెల్యే గెలవాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కోసిగి మండల నాయకులు, గ్రామాల నాయకులు, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ ఇన్చార్జిలు, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరుల పాల్గోన్నారు.

About Author