PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

16 న ఇఫ్తార్ విందు.. ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే

1 min read

– రంజాన్ నెలలో ఎంతో పవిత్రంగా నెల రోజులపాటు కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలు.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోని 27 మసీదులలో ఈ నెల 16వ తేదీన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు సందర్భంగా వారి మసీదుల వద్దే ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రతి ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు ఆతిథ్యాన్ని స్వీకరించాలని తెలిపిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు..ముస్లింలకు ఎంతో పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసం అని అలాంటి రంజాన్ మాసంలో ఎంతో కఠినమైన కఠోరమైన ఉపవాస దీక్షలు ప్రతి ముస్లిం లు ఉండడం జరుగుతుందని చెప్పారు. పవిత్రమైనటువంటి ఉపవాసాల మాసం రంజాన్ మాసంలో ముస్లింల ఖురాన్ దివి నుంచి భూమి మీదికి దిగి వచ్చిన నెల ఈ రంజాన్ మాసం అని చెప్పారు. అలాంటి రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపడుతున్న ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ఇది ఒక మతసామరస్యానికి ప్రతీక అని తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 16వ తేదీన బనగానపల్లె పట్టణంలోని 27 మసీదులలో వారి మసీదుల వద్దే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని కాబట్టి ప్రతి ముస్లిం తాను ఇస్తున్న ఇఫ్తార్ విందు ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. లాల్ మజీద్, జంగ్లీమా మజీద్, ఖాజీ వాడ మజీద్, జెండేవాలే సాహెబ్ మజీద్లలోపేషిమాం,మౌజన్ లను, కలిసి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కు హాజరుకావాలని సాదరంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు వారిని ఆహ్వానించారు.ముస్లింల మతగురువు సయ్యద్ అబ్దాల్ సాహెబ్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి 16 వ తేదీ ఇస్తున్న ఇఫ్తార్ విందు కు హాజరు కావాలని ఆ రోజు ప్రత్యేక ఫాతేహాలు మీ చేతుల మీదుగా చేయాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు కోరారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు డాక్టర్ మహ్మద్ హుస్సేన్ అత్తర్ జాహీద్ హుస్సేన్, సైకిల్ షాప్ మహబూలి, కూరగాయల రహిమాన్, బబ్లూ మైనార్టీ ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

About Author