NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిం మైనార్టీలకు..ఇఫ్తార్​విందు..

1 min read

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా రాయచోటి:రాయచోటి పట్టణంలోని  కొత్తపల్లి మహబూబ్ నగర్  గౌస్ మసీద్ లో  ముస్లిం  మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందును టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు,రాయచోటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు, స్వయంగా ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 1500 మందికి పైగా మైనారిటీ సోదరులతో కలిసి  ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన దివ్య ఖూరాన్ అవతరించిన ఈ పవిత్ర రంజాన్ మాసంలో  ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని,ఇస్లాం శాంతి,ప్రేమ,దయాగుణాలను ప్రభోధిస్తుందన్నారు   పవిత్రమైన రంజాన్ నెలలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాసంలో నియమ నిష్టలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లాహ్ కృపకు  పాత్రులవుతారని అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం , ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్‌ మాసం గొప్ప సందేశం ఇస్తోందన్నారు.రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఐక్యమత్యంతో ఉంటూ మతసామరస్యాన్ని చాటాలని ప్రసాద్ బాబు అన్నారు.ఈ కార్యక్రమంలో భారీగా  ముస్లింసోదరులు సోదరి మణులు,హిందూ సోదరులు,యువకులు,తదితరులు మతాలకు అతీతంగా భారీగా పాల్గొనడం సంతోషించదగ్గ విషయం అన్నారు.ఈ కార్యక్రమంలో మయానా ఇర్షాద్ ఖాన్,మాజీ ఎంపీటీసీ ఖాదర్ హుస్సేన్,మాజీ ,ఖాదర్ బాస్,లారీ బాషా,నవాజ్,మాజీ ఎంపీటీసీ ఖలీల్,మాజీ కౌన్సిలర్ రషీద్,కరామత్,వెల్డింగ్ రఫీ,ఫరూక్,ఎర్ర మస్తాన్,ఆఫ్రొజ్, అతావుల్లా,మహమ్మద్,మస్తాన్,సాదక్,ఫిరోజ్,కుదా హఫీజ్ మునాఫ్,ముత్తుకూరు రఫీ,కయ్యూం,అహమ్మద్,ఒదేడు అన్వర్,గౌస్ మొద్దీన్,రియాజ్,సయ్యద్ రహీమ్ మాము,CRS రంతుల్లా, మూనాఫ్, సాగీర్,S బ్రదర్స్,సత్తార్ ఖాన్,షకీల్,జావిడ్, మండి ఫరూక్,, టీడీపీ నాయకులు సుగవాసి శ్రీనివాసులు,మన్నేరు రామాంజనేయులు,బడిశెట్టి రవి, వాకా వాసు,మనోహర్, సహాడేవా, తదితరులు పాల్గొన్నారు.

About Author