టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ కార్యక్రమాన్ని తిరస్కరించాలి
1 min read
యస్ డి పి ఐ ప్రకటన
హొళగుంద , న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండలంలో పార్టీ కార్యాలయం నందు పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో S D P I ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ జె పి సి కమిటీ వక్ఫ్ సవరణ బిల్లు 2024 నందు ముస్లిం సమాజానికి అత్యంత ప్రమాదకరమైన మరియు రాజ్యాంగ విరుద్ధంగా బిజెపి నాయకులు ప్రతిపాదించిన 14 సవరణ లను ఏకపక్షంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జె పి సి)నందు ఆమోదించుకొని. 2025 మార్చు 25వ తేదీన పార్లమెంట్ సమావేశాలలో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం పొందేఅందుకు బిజెపి సిద్ధంగా ఉంది. కేంద్రంలోబిజెపి ప్రభుత్వాన్ని అన్ని విధాల సహకరిస్తున్న టిడిపి ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈనెల పార్లమెంటు సమావేశాల లో ప్రవేశపెట్టనున్న వాక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తమ వైఖరిని నారా చంద్రబాబు నాయుడు ప్రకటించని కారణంగా టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సమాజం నిరాకరించాలని కోరుతూ సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీర్మానించింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ కార్యదర్శి కే సలాం మరియు హఫీజ్ అల్లబకాష్ తదితరులు పాల్గొన్నారు.