(ఐఎఫ్ టియు) సర్వసభ్య సమావేశం..
1 min read– సమిష్టిగా ఉంటేనే సమస్య ఏ దేనైనా పరిష్కరించుకోగలం: అధ్యక్షులు కాకర్ల శ్రీను
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : స్థానిక ఐఎఫ్ టియు కార్యాలయంలో సంఘం ఏలూరు నగర అధ్యక్షులు కాకర్ల శ్రీను అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కాకర్ల శ్రీను మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులుగాని, అధికారులకుగాని ఎన్ని విజ్ఞప్తులు చేసినా పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికులందరూ సమిష్టిగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని చెప్పారు.తమ సంఘం ఏ పార్టీకి కొమ్ము కాయదని చెప్పారు.పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి పనిచేసే భవన నిర్మాణ కార్మికులకు గాని, వారి కుటుంబ సభ్యులు గానీ ఏ సమస్య వచ్చినా తామందరం కలిసి సమస్త పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం నగరంలోని వివిధ సెంటర్లకు అధ్యక్షులను నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు.పడమర వీధి సెంటర్ అధ్యక్షులుగా దిమ్మిటి నాగు, లంబాడి పేట సెంటర్ అధ్యక్షులుగా శీతల శ్రీను, శనివారపుపేట అధ్యక్షులుగా ఆత్మకూరు నాగరాజు,తాపీ మేస్త్రి కాలనీ అధ్యక్షులుగా ముక్కు రఘు, బీడీ కాలనీ సెంటర్ అధ్యక్షులుగా తిరుమలశెట్టి వెంకటరావు, చోదిమెళ్ళ సెంటర్ అధ్యక్షులుగా చక్రవర్తి,శ్రీరామ్ నగర్ సెంటర్ అధ్యక్షులుగా సిరపు సత్యనారాయణ, సుబ్బమ్మ దేవి స్కూల్ సెంటర్ అధ్యక్షులుగా లావేటి పోతరాజు,రామకృష్ణ పురం సెంటర్ అధ్యక్షులుగా మోదవ లోకేష్, కొత్తూరు సెంటర్ అధ్యక్షులుగా నాగరాజు, కోడెలు సెంటర్ అధ్యక్షులుగా రామకృష్ణ, గొల్లాయిగూడెం సెంటర్ అధ్యక్షులుగా రామరాజు,శనివారపు పేట సెంటర్ అధ్యక్షులుగా మేకల గోపి,డి మార్ట్ సెంటర్ అధ్యక్షులుగా భాస్కర్, కొత్తూరు ఇందిరమ్మ కాలనీ అధ్యక్షులుగా రమేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలుత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి విశేషంగా కృషి చేసి స్వర్గస్తులైన కూనపు రెడ్డి కృష్ణ , ఇనపనూరి పున్నయ్య,విఠల్ శ్రీహరి రావులకు సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది.