జ్ఞానం లేనివారు ఈవీ రంగంలోకి వస్తున్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై కనీస పరిజ్ఞానం లేని వారు కూడ ఈ రంగంలోకి అడుగు పెడుతున్నారని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ అన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) స్టార్ట్‌పలు పుట్టగొడుగుల్లా వెలుస్తుండటంతో పాటు ఈ మధ్య కాలంలో పలు ఈవీలు అగ్నిప్రమాదానికి గురికావడంపై బజాజ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘‘ఇక్కడ సమస్య అగ్ని ప్రమాదాలు కాదు. ఎందుకంటే, సంప్రదాయ ఇంధన వాహనాల్లోనూ అగ్నిప్రమాదాలు జరిగిన సంఘటనలున్నాయి. ఇది వాహన తయారీ ప్రక్రియకు సంబంధించిన సమస్య. ఈవీలపై మార్కెట్లో నెలకొన్న పిచ్చి హడావిడి ఆందోళన కలిగిస్తోంది. ఈవీల తయారీతో ఎలాంటి సంబంధం లేని వారు కూడా ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు..? ఈ సమస్యను తప్పక పరిష్కరించాలి. సంబంధిత ప్రభుత్వ అధికారులు ఈవీల నిబంధనలను నీరుగార్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల కారణంగానే మార్కెట్లోకి ఈవీలు వరదలా వచ్చిచేరుతున్నాయన్పిస్తోందని“ ఆయన అన్నారు.