NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుల శ్రేయస్సు కోసమే ఐకెపి కొనుగోలు కేంద్రాలు

1 min read

పల్లెవెలుగు వెబ్  శ్రీరంగాపూర్: శ్రీరాంగాపురం మండలము వెంకటాపూర్ గ్రామంలో గత కొన్ని రోజుల నుండి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న రబస పై  ఆదివారం దినపత్రికల్లో వచ్చిన కథనాలపై శ్రీరంగాపురం మండల ఐకెపి ఏ పి మ్ , సి సి  స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వారు మాట్లాడుతూ  గతంలో బుక్ కీపర్ గా పనిచేసిన వ్యక్తి మహిళా సంఘం సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి, గత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు అక్రమాలకు పాల్పడి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాము ధాన్యాన్ని నదిలో పారవేయమని అసలు అనలేదని వెలుగు సిసి సువర్ణ ఆరోపణలను ఖండించారు.  అక్రమంగా  తలుపులు పగలగొట్టి ఐదువేల గోనె సంచులను , గ్రామ సంఘం రికార్డులను పోలీస్ వారి సహకారంతో స్వాధీనం చేసుకుంటామని ఏపీవో చంద్రకళ అన్నారు. వెంకటాపూర్ ఐకెపి కేంద్రాల్లో జరుగుతున్న సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినామని ఐకెపి అధికారులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం మరియు సీసీ తో పాటు గత ఖరీఫ్ సీజన్లో కొనుగోలు తీసిన మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

About Author