NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజ్య‌స‌భ‌కు సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా !

1 min read

Ilaiyaraaja at Merku Thodarchi Malai Press Meet

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ‘మేస్ట్రో’ ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానిక, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేసే విషయం తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన 12 మందిని రాష్ట్ర‌ప‌తి రాజ్యసభసభ్యులుగా నియమిస్తారు. ఆ కోటాలోనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువసభకు పంపింది. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఇప్పుడు ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన ఇటీవల ‘అంబేడ్కర్‌-మోదీ’ పుస్తకానికి ముందుమాటలో అంబేడ్కర్‌ ఆశయాలను మోదీ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

                                     

About Author