PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ మద్యం పట్టివేత

1 min read

పల్లెవెలుగువెబ్​, చెన్నూరు: మండల కేంద్రంలోని అరుంధతి నగర్ లో అక్రమ మద్యం విక్రయిస్తున్న పెద్దపల్లి వెంకటేష్ ను దాడి చేసి పట్టుకున్నట్లు ఎస్​ఐ బి. శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. దాడిలో 12 బాటిల్స్​ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మండలంలోని ఉప్పరపల్లె గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ కట్ట దగ్గర పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 11, 590 నగదు, మూడు సెల్​ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు యస్.ఐ తెలిపారు.

About Author