సిపిఐ నాయకుల అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం..
1 min readజిల్లా రైతుల పట్ల సీఎం నిర్లక్ష్యం తగదు..
నంద్యాల జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లాలో వర్షాలు లేక , కేసి కెనాల్ కు సక్రమంగా సాగునీరు అందక రైతుల పంటలు ఒకపక్క ఎండిపోతుంటే వారిని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అడిగిన సిపిఐ నంద్యాల, కర్నూలు జిల్లా నాయకులను అక్రమ నిర్బంధం చేసి అరెస్టు చేయడం ప్రజాస్వామికమని తక్షణమే నంద్యాల జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా నాయకులు ఎం.రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో కరువుతో రైతులు అల్లాడుతున్నారని హంద్రీనివా జలాలు చెరువులకు అందిచే ప్రారంబ కార్యక్రమనికి డోన్ కి వస్తున్న ముఖ్యమంత్రి ఈ ప్రాంత రైతుల సమస్యలను తెలుసుకోవాలన్నారు.సాగు నీరు లేక వరి పంటలకు పునాదిగా ఉన్న నంద్యాల ప్రాంతం ఎండిపోయిందన్నారు.కలెక్టరు మాటలు విని ఆరుతడి పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. జిల్లా రైతుల సమస్యలు జిల్లాలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డికి తెలియదా అని వారు ప్రశ్నించారు. కనీసంఒక పంటకు సాగు నీరు ఇవ్వలేని దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. రైతులకు సాధించిందేమీ లేదన్నారు. గొప్పలు చెప్పుకోవడం ప్రభుత్వనికి అలవాటు గా మారిందన్నారు.తక్షణమే నంద్యాల జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ. 30 వేలు నష్టపరిహారం అందించాలని వారి డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అరెస్టు చేసిన నిర్బంధం చేసిన నాయకులను విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వాహిదూదిన్,నరసింహ, బాషా తదితరులు పాల్గొన్నారు.